పులిలా పోరాడుతాను తప్ప.. పిల్లిలా వెనుకడుగు వేయను : కేసీఆర్

ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. తాజాగా ఛలో నల్గొండ బహిరంగ సభలో మాట్లాడారు కేసీఆర్. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండ ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. ఓటు సమయంలో నంగనాచి కబుర్లు చెబుతారు.. తరువాత ఎవ్వరూ రారు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అంటారు. ఉమ్మడి రాష్ట్రం బాగుంటే ఇంత ఉద్యమం ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు కేసీఆర్.

కేసీఆర్ ని తిడితే కాంగ్రెసోల్లు పెద్దోళ్లు అవుతారా..? అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. మేము తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంట్ ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తారు. మేము ఏం చేశామో తెలంగాణ ప్రజలు కళ్లారా చూశారు. పులిలా పోరాడుతా తప్ప.. పిల్లిలా వెనుకడుగు వేయను అని పేర్కొన్నారు. ప్రజల హక్కులను గాలికి వదిలేసి.. అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోగానే మళ్లీ కరెంట్ సమస్యలు మొదలయ్యాయని తెలిపారు కేసీఆర్.