మొటిమల సమస్యకు ఈ ఫేస్ ప్యాక్..

స్కిన్ కేర్ రొటీన్ ను సరిగ్గా పాటిస్తే వృద్ధాప్యంలో కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు. రసాయన ఆధారిత సౌందర్య ఉత్పత్తులతో పోలిస్తే, సహజ వస్తువుల నుండి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే చర్మ సంరక్షణ కోసం సహజసిద్ధమైన పదార్థాలో మొదటి వరుసలో ముల్తానీ మట్టి ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఉపయోగం చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా, ఛాయను మెరుగుపరచడంలోను పనిచేస్తుంది. అందుకే మీ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మార్చేలా కొన్ని ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం.

*ఒక టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, అర టీ స్పూన్ గంధం పొడి, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, ఒకటి నుండి రెండు టీ స్పూన్ల దోసకాయ రసం జోడించండి. ఈ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేసి 20 నుండి 25 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసవిలో మిమ్మల్ని రిఫ్రెష్‌గా పాటు, ఛాయను కూడా మెరుగుపరుస్తుంది.
*ఒక చెంచా ముల్తానీ మిట్టి, నిమ్మరసం, ఒక చెంచా అలోవెరా జెల్, చిటికెడు పసుపు, ఒక చెంచా పెరుగు కలిపి సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల టానింగ్, మొటిమలు, అసమాన టోన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిచి.. చర్మం పొడి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
*ముల్తానీ మట్టిలో కొన్ని చుక్కల నిమ్మరసం, రోజ్ వాటర్, అర టీ స్పూన్ వేప ఆకుల పొడిని కలిపిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలను వదిలించుకోవడమే కాకుండా మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.