యాంకర్‌గా మారనున్న టాప్ హీరోయిన్

దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియాన డిసౌజ. టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలు రావడంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్యలో ఇల్లు బేబీకి అస్సలు ఛాన్సులు రావడం లేదు. దీంతో ఈ గోవా బ్యూటీ కెరీర్ చాలా తెబ్బతిందని టాక్ వినిపిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు కొత్త కెరీర్ స్టార్ట్ చేద్దామనుకుంటుంది. అందుకే ఇప్పుడు యాంకరింగ్ మీద ఫోకస్ పెట్టింది.

అయితే యాంకర్ అంటే ఏదో టీవీ కామెడీ షోలకు, మ్యూజిక్‌ షోలకు యాంకర్‌గా మారడం లేదంట. ఓ స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా మారాలని చూస్తుందట ఇల్లీ బ్యూటీ. ఆ ఛానల్ యాజమాన్యం తో ఆమె ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనికి యాజమాన్యం కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఇలియాన చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి. ఆ ఈ సిమాలు పూర్తి అయితే ఆమె యాంకర్ గా పూర్తి స్థాయిలో వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె కు మాత్రం సదరు ఛానల్ బాగానే ఆఫర్ చేసింది అంటున్నారు. .