ఆ పరిస్థితిలో అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా : అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ అందుకున్నడు. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాతో చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి ఉన్న చాలా ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారి..అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే అసలు వీరిద్దరి పరిచాయం ఎలా ఎర్పడింది అనే సందేహం చాలా మందిలో వచ్చింది. మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ అకిరాను కలిసాను. అప్పుడు తను నాకు మీ సినిమాలు ఇష్టం అన్నాగా.. నాకు మీ నాన్నగారి సినిమాలు ఇష్టమని చెప్పాను. అకిరాకి సంగీతం అంటే చాలా ఆసక్తి ఒకసారి నా సినిమాలో పాటను ప్లే చేసి పంపించాడు. అప్పుడు నేను తనకి పడిపోయానని షో లో అడివి శేష్ చెప్పాడు.

మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ ని ఇలా అడిగాడు.. నువ్వు రాసిన కథకి డైరెక్షన్ చేసే అవకాశం వస్తే.. పవన్ కళ్యాణ్ ఎంచుకుంటావా లేక అకిరాతో సినిమా చేస్తావా అని అడుగుతాడు.. అప్పుడు శేష్ పవన్ గారు అంటే గౌరవం కానీ అకిరా అంటే ప్రాణం.. అందుకే అకిరాకి ఎస్ చెబుతాను.. పవన్‌కి నో చెబుతాను అంటూ సమాధానమిచ్చాడు.