వైసిపి ఎంపి ఇంట్లో ఐటి తనిఖీలు

రాజ్యసభ సభ్యుడు, వైసిపి నేత అయోధ్య రామిరెడ్డి ఇంట్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాంకీ సంస్థల చైర్మన్‌గా అయోధ్య రామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాంకీ సంస్థ చాలా ప్రాజెక్టులను నిర్వహించింది. ట్యాక్స్‌ చెల్లింపుల విషయంలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని 15 చోట్ల ఐటి సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదాపూర్‌లోని రాంకి ప్రధాన కార్యాలయంలోనూ, రాంకీ అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టారు. సంస్థకు చెందిన కొంతమంది డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఏఏ అంశాలు, దేనికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయనేది అధికారులు కాసేపట్లో వెల్లడించనున్నారు.