కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు పెరుగుతుందా..

కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో, జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.

స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఉండదు. రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.

కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి సహాయం చేస్తాయి. సీబమ్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేసి జుట్టుకి నరిష్‌మెంట్ ని అందిస్తాయి.

స్కాల్ప్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌ని కుంకుడుకాయలు సాల్వ్ చేస్తాయి. చుండ్రూ, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్, వంటివన్నీ కుంకుడుకాయలని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటే దూరమౌతాయి. పైగా, ఒకసారి ఈ ప్రాబ్లంస్ క్లియర్ అయ్యాక మళ్ళీ రాకుండా కుడా ఉంటాయి.

కుంకుడు కాయలు, హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్ లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. ఫ్రిజ్జీ హేయిర్ సమస్య పూర్తిగా పోతుంది.

6. కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్ గా ఉంటుంది.