‘100 కోట్ల’ వ్యాక్సినేషన్‌ పై ప్రధాని మోడీ

కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ‘భారత్ సరికొత్త చరిత్రను లిఖించాం. 130 కోట్ల మంది భారతీయుల సమిష్ట స్పూర్తి,  భారత సైన్సు, ఎంటర్ ప్రైజ్ విజయాన్ని నేడు మనం చూస్తున్నాం. టీకా పంపిణీలో 100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసిన మన డాక్టర్లకు, నర్సులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ ని ట్విట్ చేశారు. ఇదిలా ఉండగా కోవిడ్-19 వ్యాక్సినేషన్‌లో భారత్ గొప్ప ఘనత సృష్టించిందని ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. దేశ జనాభాలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులైనవారిలో 75 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘనత సాధించేందుకు మన దేశానికి 9 నెలలు పట్టింది.