హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలో కొత్త సినిమాకి ఓ వెరైటీ టైటిల్ని పరిశీలిస్తున్నారు. హీరో నవీన్ పొలిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి ..మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహేశ్ దర్శకత్వం వహించనుండగా, యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నారు. ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ‘నిశ్శబ్ధం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
