గుడ్డు ఉడకబెట్టి తింటే మంచిదా.. పచ్చిగానే తీసుకోవాలా..

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. గుడ్లలో మన శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్ ‌శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఎందుకంటే గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మెదడు ఆరోగ్యానికి గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది.

పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు. బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కండరాలను నిర్మించడానికి ఎక్కువ ప్రోటీన్ పొందడానికి మంచి మార్గంగా పరిగణించబడుతుంది. అయితే గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగొచ్చు. కానీ, ప‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అని ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంద‌ట‌. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప ప‌రిమాణంలో ఉంటుంది. గుడ్డును అలాగే ప‌చ్చిగా తాగేస్తే… దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది. దీని వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు ప‌చ్చి గుడ్ల‌ను తాగ‌కూడ‌దు. అందువల్ల ప్రతి ఒక్కరు రోజుకో గుడ్డు అయినా తినాలి.

అదే విధంగా ప‌చ్చిగా తాగ‌డం క‌న్నా ఉడికించి గుడ్డు తీసుకోవడం చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషకాలు ఇందులో ఎక్కవుగా ఉంటాయి. రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్స్, విటమిన్స్, పోషకాలు ఎక్కువగా పొందొచ్చు. అందుకే గుడ్డుని ఉడికించి తినడం వల్ల అనారోగ్యాన్ని నివారించడానికి మంచి కారణం, కానీ అది మాత్రమే కాదు. పచ్చి గుడ్డు కంటే ఉడికించిన గుడ్డు ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తాయని మార్ష్ఫీల్డ్ క్లినిక్ డైటీషియన్ కొర్రీ స్టాఫ్ అన్నారు. అందుకే పచ్చి గుడ్లు తినడంతో పోలిస్తే ఉడికించిన గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.