ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తినొద్దు.. ఎందుకంటే..

ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లు తింటున్నారా..ఇక అంతే ..

అరటి పండ్లు.. అందరికీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ పండులో పోషకాలు ఎన్నో ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ తినొచ్చు. ప్రతి ఒక్కరికీ సులభంగా లభించే ఈ పండ్లల్లో ఎన్నో ఘనమైన విటమిన్లు ఉంటాయి. అయితే, మనం పండ్లని ఫ్రిజ్‌లో పెడతాం. ఎందుకంటే చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని.. అలానే అరటిపండ్లు కూడా.. మరి ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లని తినొచ్చా లేదా.. ఇప్పుడు చూద్దాం..

చాలా రకాల పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అలానే చాలా మంది అరటిపండ్లని కూడా పెడుతుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

అరటి పండ్లని ఫ్రిజ్‌లో పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పండ్లు సరిగా పండవు. అంతేనా.. పై తొక్కు నల్లగా మారిమారిపోయి పండు రుచి తగ్గిపోతుంది.