కూరగాయలను డిటర్జెంట్స్‌తో కడిగితే కరోనా వైరస్ పోతుందా..

ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది.. రోజురోజుకి ఈ వైరస్ విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ వైరస్‌ నుంచి తమని తాము కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంట్లో వాడే ప్రతి వస్తువుని జాగ్రత్తగా వాడడం. తెచ్చుకుంటున్న వస్తువులని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు కడగడం ఇలా చేస్తున్నారు.

లాక్ డౌన్ కారణగా కూడా బయటికి వెళ్లడం లేదు. ఒకేసారి ఇంట్లోకి కావాల్సిన వస్తువులని తెచ్చి పెట్టుకుంటున్నారు. ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు నెలకోసారి తెచ్చిపెట్టుకోగా, కూరగాయలు, ఆకుూరలు వారానికి ఓ సారి తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే, కూరగాయలు, పండ్లు తెచ్చుకుంటున్నారు. వాటిని శుభ్రం చేసుకునే విషయంలో ఎన్నో అనుమానాలు.. వాటిపై బ్యాక్టీరియా, క్రిములని నాశనం చేయాలని మళ్లీ మళ్లీ కడగటం, డిటర్జెంట్స్, డెటాల్, శానిటైజర్స్‌తో క్లీన్ చేసి వాటిని క్లీన్ చేసి అరగంట పాటు ఆరబెట్టి వాడుకుంటున్నారు.

మరి ఇలా డిటర్జెంట్స్‌తో క్లీన్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలా క్లీన్ చేశాక.. వాటిని మళ్లీ సరిగ్గా కడగకపోతే వాటిపై డిటర్జెంట్స్ ఉంటాయని, అవి లేని పోని సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అందుకే డిటర్జెంట్స్‌తో కూరగాయలను క్లీన్ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.