చంద్రబాబు సన్నిహితుడి ఆఫీసుల్లో ఐటీ సోదాలు

చంద్రబాబు సన్నిహితుడి ఆఫీసుల్లో ఐటీ సోదాలు

ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. బుధవారం విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమరావతిలో భూముల ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ అధినేత లింగమనేని రమేష్ ఆరోపణలు వచ్చాయి. అందుకే సోదాలు జరిగాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు గతంలో కృష్ణా నది కరకట్టపై లింగమనేని ఎస్టేట్స్ సంస్థ అక్రమంగా కట్టడాలు చేపట్టారంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇటీవల అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ మీద కేబినెట్ సబ్ కమిటీ కూడా తమ నివేదికలో లింగమనేని రమేష్ పేరు ఉంది.