ఇవాంక ఫొటోలపై స్పందించిన సాయి తేజ్

ఇవాంక ఫొటోలపై స్పందించిన సాయి తేజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా భారత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె తాజ్‌మహల్‌ ముందు కూర్చొని ఫొటో దిగారు. ఆ ఫొటోను చాలా మంది మార్ఫింగ్‌ చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇవాంకను ఓ యువకుడు సైకిల్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఉన్న ఫొటో అందరినీ ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే, ఇవాంక స్పందించిన తీరుకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముగ్ధులైపోయారు. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకున్నారు. ఈ మేరకు ఇవాంక ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ‘‘ఈ ట్వీట్ మీ గొప్పతనాన్ని, సూపర్ సెన్సాఫ్ హ్యూమర్‌ను తెలియజేస్తుంది. నా మాతృభూమి తరఫున మీకు దక్కిన గౌరవం, ప్రేమ ఇవి. ధన్యవాదాలు’’ అని సాయి తేజ్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఇవాంక ట్రంప్ భారతీయుల మనసులు గెలుచుకున్నారు.