నిర్భయ దోషుల ఉరిపై అనసూయ ట్వీట్.. అర్థం కాలేదంటున్న నెటిజన్స్

జబర్దస్త్ యాంకర్ అనసూయ నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై తాజాగా స్పందించింది. ఈ సందర్భంగా అనసూయ హిందీలో ట్వీట్ చేసింది. ‘ఇన్‌సాఫ్‌కి సుభాహ్.. దేర్ సే హి సహీ’ అంటూ హిందీలో పోస్టు పెట్టింది. న్యాయోదయం… కాస్త ఆలస్యం అయినా సరైనది ’ అంటూ అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేసింది అనసూయ. దీంతో జబర్దస్త్ బ్యూటీ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పెట్టిన పోస్టుకు అర్థం ఏంటని అడుగుతున్నారు. మరికొందరు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు న్యాయం గెలిచిందని ట్వీట్ చేస్తున్నారు.