చిత్తూరు జల్లికట్టులో 30 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన జల్లికట్టు కార్యక్రమంలో 30 మందికి పైగా గాయపడ్డారు. నిన్న చిత్తూరులో నిర్వహించిన జల్లికట్టు ఆట ‘పశువుల పండుగ’లో పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చినవారితోపాటు వందలాదిమంది పాల్గొన్నారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి, చంద్రగిరి మండల పరిధిలోని వార్షిక కార్యక్రమంలో 500 పైగా ఎద్దులు, వందలాది గ్రామస్థులు పాల్గొన్నారు. నివేదిక ప్రకారం… జల్లికట్టు వేడుకలో 30 మందికి పైగా గాయపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని గుండుపల్లి మండలం పరిధిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం చిత్తూరులో 1,124 కోవిడ్‌ -19 కేసులు నమోదయ్యాయి, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,570 కేసులు నమోదయ్యాయి.