జగన్ నిర్ణయంతో జనసైనికులు ఖుషీ..

జగన్ నిర్ణయంతో జనసైనికులు ఖుషీ..

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు వ్యవహారం రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది.. ప్రీతి విషయంలో జగన్ సర్కార్‌ పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. కర్నూలులో మార్చ్ ఏర్పాటు చేసిన నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ను ప్రీతి కుటుంబం కలిసి న్యాయం చేయాలని కోరింది.. సీఎం కూడా ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రీతి కేసుపై స్పందించడం.. ఆమె కుటుంబ సభ్యుల్ని కలవడం.. సీబీఐకి రిఫర్ చేస్తామని చెప్పడంతో జనసైనికులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇది జనసేన పార్టీ, తమ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటంతోనే ప్రభుత్వం స్పందించిందని.. ఇది తమ విజయం అంటున్నారు. సోషల్ మీడియాలో జనసేనానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.