జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన జగన్‌

2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం జగన్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించామన్నారు. 2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయని, అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50 లక్షలకు పైగా నిరుద్యోగులను భాగస్వామ్యం చేశామని సిఎం చెప్పారు. ఎపి లో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. మినిమమ్‌ టైం స్కేల్‌తో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీతాలు పెంచామన్నారు.