ప్రభాస్‌తో తలపడనున్న బాలీవుడ్‌ హీరో

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం కనిపించబోతున్నట్లు సమాచారం. అతిథి పాత్రే అయినా విలన్స్‌ను లీడ్‌ చేసే ప్రధాన క్యారెక్టర్‌లో నటిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. 2021లోపే సినిమా పూర్తి చేయాలని లాక్‌డౌన్‌ ముగిసిన వెంటన్‌ షఉటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటోంది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తోంది.