ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు

ఈ డ్రింక్స్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు

ప్రకృతిలో శీతాకాలం, వసంతకాలం ఇలా మారుతూ ఉంటాయి. కొన్నికాలాలు మార్పు మరియు ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ… సంతోషిస్తాము, కాని కాలానుగుణ మార్పు అనేక రకాల వ్యాధులను తెస్తుంది, దీనివల్ల అనేక మంది అనారోగ్యానికి గురౌతుంటారు. దీని వల్ల జ్వరం, దగ్గు జలుబు మరియు చికెన్ పాక్స్ లాంటివి వస్తుంటాయి.”రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వల్ల కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు .అయితే ” విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయల తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు . శిల్పా అరోరా చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం రెసిపీని పంచుకునారు. అది మిమ్మల్ని హైడ్రేట్ గా మరియు మీ రోజువారీ కావల్సిన విటమిన్ సి మోతాదును మీ శరీరానికి అందిస్తుంది.

​విటమిన్ సి-రిచ్ డ్రింక్..

విటమిన్ సి ఆరోగ్యాన్ని సంరక్షించటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా. విటమిన్ సి వివిధ రకాలుగా ఉపయోగం చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ లోపాల నుంచి, గుండె జబ్బుల నుంచి, గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మరియు ఆఖరికి చర్మం ముడతలుపడటం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ సి ను శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు, అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైనది. పానీయం తయారు చేయడానికి మీకు కావలసిందల్లా ఒక కీరాదోసకాయ, సగం నిమ్మకాయి, ఒక కప్పు పుదీనా మరియు ఒక చిటికెడు నల్ల ఉప్పు.

కీరాదోసకాయ

కీరాదోసకాయ ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తుంది. కీరదోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినిరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, ఐరన్ మరియు క్యాల్షియంలు అధికంగా ఉన్నాయి.దోసకాయ మీ శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. శిల్పా అరోరా ప్రకారం, కీరదోసలో 95 శాతం నీటి శాతం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కెఫిక్ ఆమ్లం అనే రెండు సమ్మేళనాలు ఉన్నాయి. కీరదోసలో అధిక నీరు ఉన్నందున విషాన్ని బయటకు తీయడానికి కూడా ఇది సహాయపడుతుంది. కీరదోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. దోసకాయ లో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గటానికి చాలా సహాయపడుతుంది. కీరదోస రొమ్ము కాన్సర్, అండాశయ కాన్సర్, గర్భాశయ కాన్సర్ మరియు ప్రోస్టేట్ కాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి.