‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళాపురం’. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. సత్యం రాజేష్, చిత్రం శ్రీను కీలక పాత్రల్లో నటించారు. రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ ”ఇప్పటివరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశాను. ‘కళాపురం’ కామెడీ సినిమా. అయితే కామెడీలో అశ్లీలత ఉండదు” అని తెలిపారు. ”క్యూట్ కామెడీ చిత్రమిది” అని సత్యం రాజేశ్, ”చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి పాత్ర చేశాను” అని చిత్రం శ్రీను మాట్లాడారు.
