విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ విజయ్ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోనే. ప్రస్తుతం ఆయన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే కరణ్ విజయ్‌తో ఓ డీల్ కుదుర్చుకున్నారట.

విజయ్‌కు బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. అక్కడ సినిమాలు చేయకపోయినప్పటికీ తన స్టైల్, స్వాగ్‌తో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక సినిమాల్లోకి వస్తే బాలీవుడ్‌లోనూ మంచి కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో విజయ్‌తో మరిన్ని సినిమాలు చేయాలని కరణ్ అనుకుంటున్నారట. ఏడాదికి ఆయనతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే విజయ్‌కు తెలుగులో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా కరణ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమాకు ఓకే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విజయ్ 100 కోట్లు కావాలని అడిగారట.