రైతును పెళ్లి చేసుకునే యువతికి రూ.5 లక్షలు ఇవ్వాలి..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కు రైతు సంఘాల ప్రతినిధులు వినూత్న వినతి అందించారు. రైతు యువకుడిని వివాహం చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం అందించాలని కోరారు. వ్యవసాయం చేస్తున్న యువకులకు 45 ఏళ్లు వస్తున్నా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడంలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతు రుణమాఫీతో పాటు యువరైతులను పెళ్లి చేసుకునే యువతులకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు.