కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు : సీఎం రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే.. జాలేస్తోంది. ఆయన అధికారం పోయిన బాధలో ఉన్నారు. పదేళ్ల తరువాత కేసీఆర్ కి రైతులు గుర్తుకొచ్చారు. మా వల్లనే కరువు వచ్చిందని అంటున్నారు. వర్షాలు కురవకపోవడంతో కరువు వచ్చింది. మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతోంది. మా వల్ల కరువు ఎలా వస్తుందని మండిపడ్డారు.

కేసీఆర్ అధికారం కోల్పోయిన దు:ఖంలో ఉన్నాడు. రైతుల మీద కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది అన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. 200 మంది రైతుల వివరాలను రెండు రోజుల్లోపు కేసీఆర్ ప్రభుత్వానికి అందజేస్తే.. వారికి నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని.. రైతుల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.