కొత్త ఐటీ రూల్స్‌పై ఎన్‌బీఏ పిటిషన్… కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్‌ను సవాల్ చేసిన న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)కు అనుకూలంగా కేరళ హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌బీఏలో భాగంగా ఉన్న వార్తా సంస్థలకు వ్యతిరేకంగా ఈ రూల్స్ ప్రకారం ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ; సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలకు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చింది.