మహేష్ బాబుతో జోడీ కట్టనున్న మహానటి

సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ కోసం హీరోయిన్ వేట ప్రారంభించిన దర్శకనిర్మాతలు చివరకు దక్షిణాది ముద్దుగుమ్మనే ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇటీవలే టైటిల్, ప్రీ లుక్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. కొన్ని రోజులుగా హీరోయిన్ వేట ప్రారంభించింది. ఈ క్రమంలో పలువురి పేర్లు పరిశీలించి, ఫైనల్‌గా కీర్తి సురేష్‌ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొదట మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ని ఎంపిక చేయాలనుకున్నారు డైరెక్టర్ పరశురామ్. అయితే డేట్స్ అడ్జెక్ట్ కాని కారణంగా ఆయన కీర్తి సురేష్‌ని సంప్రదించారట. కథ విన్నాక పాజిటివ్‌గా రియాక్ట్ అయిన కీర్తి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. పరశురామ్ అడిగిన డేట్స్ కూడా కీర్తికి అందుబాటులో ఉండటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూట్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు దర్శకనిర్మాతలు.