కియా మోటర్స్ తరలింపుపై ఎండీ సంచలన ప్రకటన

కియా మోటర్స్ తరలింపుపై ఎండీ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లాలో నెలకొల్పిన కియా మోటర్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ గత కొంతకాలంగా వెలువడుతున్న వార్తలకు ఆ కంపెనీ చెక్ పెట్టింది. కియా మోటర్స్‌ను అనంతపురంలోనే కొనసాగిస్తామని కంపెనీ ఎండీ ప్రకటించారు. అనంత ఫ్యాక్టరీ నుంచే ప్రపంచ స్థాయి వాహనాలు తయారు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కంపెనీ ప్రతినిధి కియా మోటర్స్ ఎండీ సందేశాన్ని చదివి వినిపించారు.

ఏపీ నుంచి కియా తరలిపోతోందని.. ప్రాథమికంగా చర్చలు ప్రారంభమయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. దీనిపై రాష్ట్రంలో పెద్దఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఈ కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ ఖండించగా, తాజాగా కియా మోటర్స్ ఎండీ అనంత నుంచి కంపెనీ ఎక్కడికీ వెళ్లట్లేదని స్పష్టం చేశారు.