అనంతపురం టు ఢిల్లీ కిసాన్ రైలును ప్రారంభించిన జగన్

అనంతపురం టు ఢిల్లీ కిసార్ రైలు కదిలింది. రైతులు పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ ప్రారంభమైంది. ‘అనంత’ రైతన్న ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఉద్యాన హబ్‌’ కల సాకారమైంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బుధవారం ఢిల్లీకి ప్రత్యేకంగా ‘కిసాన్‌ రైలు’ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్‌ సి.అంగడి జూమ్‌ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతపురం రైల్వే స్టేషన్‌నుంచి ఈ రైలు బయలుదేరింది. మహారాష్ట్ర తర్వాత ఇది రెండో ‘కిసాన్‌ రైలు’ కావడం గమనార్హం. అక్టోబర్‌ నుంచి రైలును పూర్తిస్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టనున్నారు.