మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయం బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో ఉంది. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.