కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ సాంగ్

కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ ఫస్ట్ సాంగ్

మహానటితో జాతీయ అవార్డు అందుకున్న హీరయిన్  కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత పెద్దగా హడావిడి లేకుండా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా కీర్తి మిస్ ఇండియా అనే సినిమా చేస్తుంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమానుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ‘కొత్తగా కొత్తగా’ అంటూ సాగే ఈ పాటను మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్ పాడారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి6న విడుదల చెయ్యాలని చూస్తుంది చిత్రయూనిట్.