వీరి ప్రేమ కథతో ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నా కొత్తజంట …

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సినిమా సమయంలో ఏర్పడ్డ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గతేడాది నవంబర్‌లో వీరు గ్రాండ్‌గా ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యారేజెస్‌లో వరుణ్‌-లావణ్యల పెళ్లి ప్రముఖంగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఓ క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి.


శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌ లో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇందులో హేబా పటేల్‌ మరో హీరోయిన్‌. ఆ సమయంలో ఇద్దరి మధ్యస్నేహం ఏర్పడి… అదికాస్త ప్రేమగా మారిందట. అయితే సినిమా ఎండింగ్‌లోనే వరుణ్‌ తేజ్‌ లావణ్యకు లవ్‌ ప్రోజ్‌ చేశాడట. అది కూడా సినిమా స్టయిల్‌లో. ఆ సినిమా ఏదో కాదు రాశీఖన్నా,వరుణ్‌ తేజ్‌ జంటగా నటించిన తొలిప్రేమ… ఇందులో కాలేజీలో రాశీఖన్నాకి లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు వరుణ్‌ తేజ్‌. అందరి ముందు ప్రపోజ్‌ చేస్తూ గులాబీ పువ్వు ఇస్తాడు. ఆయన ప్రపోజల్‌కి ఫిదా అయిన రాశీఖన్నా మరో ఆలోచన లేకుండా ఓకే చెబుతుంది. అయితే ఆ సినిమా స్టయిల్లోనే లావణ్యకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడని, అప్పటికే వరుణ్‌ అంటే ఇష్టం ఏర్పడటంతో తను వెంటనే ఓకే చెప్పిందట.

ప్రస్తుతం ఈ ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. మరి ఇంతకి తొలిప్రేమలో వరుణ్‌ తేజ్‌ రాశీఖన్నాకి ఏం చెప్పాడనేది చూస్తే.. కలలా నా జీవితంలోకి వచ్చావు. కల కంటున్నప్పుడు వెళ్లిపోయావు. మళ్లీ ఇన్నాళ్లకి ఇలా మెరిశావు. ఇది కలా నిజమా అర్థం కావడం లేదు. నిజమైతే ఈ పువ్వు తీసుకో. కలైతే కనీసం ఈ సారైనా నన్ను నిద్ర లేపు అని చెబుతాడు వరుణ్‌. దెబ్బకి నవ్వులు చిందిస్తూ ఆ రోజాపువ్వుని తీసుకుంటుంది రాశీఖన్నా. దీంతో కాలేజ్‌ స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడతారు. ఆ లవ్‌ ప్రపోజల్‌ చాలా లైవ్లీగా, పోయెటిగ్‌గా ఉంది. మొత్తానికి సినిమా డైలాగ్‌తోనే లావణ్యని పడేశాడన్నమాట వరుణ్‌ తేజ్‌.