ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్‌లు మినహా మిగతా చోట్ల మద్యం అమ్మకాలు జరుగనున్నాయి. కాగా నేటి మద్యం ధరలను 25శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు చెబుతోంది. అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.120 ఉండే వాటిపై రూ.10 నుంచి రూ. 240 వరకు ధర పెంచారు. 180 ఎంఎల్ రూ.150 వరకు ఉండే మద్యంపై రూ.20 నుంచి రూ.480 వరకు ధర పెరిగింది. రూ.150 కంటే ఎక్కువ ధర ఉన్న విదేశీ మద్యంపై రూ.30నుంచి రూ.720 వరకు పెంచారు. ఇక బీర్లు 330 ఎంఎల్‌కు రూ.20 నుంచి.. 5లీటర్ల బాటిల్‌కు రూ.3000 పెంచారు.
పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి..
బీరు 330ml – పెరిగిన ధర రూ.20
500/650ml -రూ.30
30000ml – రూ.2000
50000ml- 3000రూ.
రెడీ టూ డ్రింక్ 250/275ml. -రూ.30 పెరుగుదల
180ml ధర రూ.120కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు
60/90ml – రూ.10పెరుగుదల
180 ml – రూ.20 పెరుగుదల
375ml – రూ.40 పెరుగుదల
750ml – రూ.80 పెరుగుదల
1000ml -రూ.120 పెరుగుదల
2000ml – రూ.240 పెరుగుదల
180ml ధర రూ.120 నుంచి రూ.180 మధ్యలో ఉన్న వాటిపై పెంపు
60/90ml- రూ.20 పెరుగుదల
180 ml – రూ.40 పెరుగుదల
375ml – రూ.80 పెరుగుదల
750ml – రూ.160 పెరుగుదల
1000ml – రూ.240 పెరుగుదల
2000ml – రూ.480 పెరుగుదల
రూ.150కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు
60/90ml – రూ.30 పెరుగుదల
180 ml – రూ.60 పెరుగుదల
375ml – రూ.120 పెరుగుదల
750ml – రూ.240 పెరుగుదల
1000ml – రూ.360 పెరుగుదల
2000ml – రూ.720 పెరుగుదల