యూకేలో రెండేళ్ల తరువాత ‘లవ్‌ స్టోరీ’

టాలీవుడ్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టే ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఒకటి. అందులో ముఖ్యంగా యుఎస్ఎ బాక్సాఫీస్ తెలుగు సినిమాకి ప్రధాన ఆదాయాన్ని అందించే మార్కెట్లలో ఉంటుంది. యూఎస్ తో పాటు యూకేలో కూడా ‘లవ్ స్టోరీ’ భారీ సంఖ్యలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900+ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూకేలో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘లవ్ స్టోరీ’ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లిస్ట్ ను విడుదల చేశారు.

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘లవ్‌ స్టోరీ’. ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌, యూకేల్లో 900 థియేటర్లలో విడుదల కానుంది. అయితే యూకేల్లో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘లవ్‌ స్టోరీ’ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్‌ థియేటర్స్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. ‘జాతి రత్నాలు’ మాత్రమే యుఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద బాగా రాణించగలిగింది. ఇప్పుడు ‘లవ్‌ స్టోరీ’ అక్కడ విడుదలకు ముందే అద్భుతమైన ప్రీ-సేల్స్‌ పొందడం నిర్మాతలకు సరికొత్త ఆశను చిగురించేలా చేస్తోంది.