MAA ఎన్నికలలో ఓటు వేయడానికి రాను : ఎన్టీఆర్

ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న వేళ… అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు, ప్రకాష్‌రాజ్‌ లు మేము గెలుస్తామంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శల మధ్య జరుగుతోన్న ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించే పనిలో అభ్యర్థులు నిమగమయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్‌ ఉన్నట్టు తెలుస్తుంది. మంచు విష్ణు పలువురు ప్రముఖుల సపోర్ట్‌ కోసం వారి ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, నరేష్‌ వంటి వారిని విష్ణు కలిసిన విషయం తెలిసిందే. తాజాగా జీవిత ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. జీవిత మాట్లాడుతూ.. తాను ఇటీవల ఓ పార్టీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో తాను ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పి తనకే ఓటు వేయాలని అభ్యర్థించగా ప్రస్తుత పరిస్థితులపై జూనియర్‌ ఎన్టీఆర్‌ అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని అన్నారని, ఓటు వేసేందుకు రాబోనని స్పష్టం చేశారని జీవిత పేర్కొన్నారు. ఓటు కూడా అడగొద్దని ఎన్టీఆర్‌ చెప్పారని, ప్రస్తుత పరిస్థితులు ఆయన చెప్పిన విధంగానే ఉన్నాయని జీవిత వివరించారు.