మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలున్న వేళ… తాజాగా సోమవారం ఉదయం సినీనటుడు ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఎన్నికల నామినేషన్ వేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కూడా నామినేషన్ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 10 న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.