బీటీ ప్రభుత్వ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!

మదనపల్లెకు మహర్దశ పట్టింది. రాయలసీమలో చారిత్రక నేపథ్యం కలిగిన బిసెంట్ థియోసాఫికల్ ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ పరం చేయాలన్న పట్టణ ప్రజల ఆకాంక్షను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాకారం చేసింది. అంతే కాకుండా, ఎన్నికల సమయంలో ఎంపీ మిథున్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అనిబిసెంట్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ తాజా గా జీవో విడుదల చేసింది. దీంతో పట్టణ ప్రజలు, పూర్వవిద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యా ర్థుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్. దేశాయ్ తిప్పారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మ ద్ మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, వైస్ చైర్మన్ జింకాచలపతి, నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాబిషేకం నిర్వహించారు.