ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మహేశ్‌ దంపతులు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ దంపతులు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి అండగా నిలుస్తున్నారు. ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ దంపతులు తమ సేవ కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్‌ అనే హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత  సిరివెన్నెల సీతారామ శాస్త్రి,  యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.