వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పూర్తి చేసిన మహేష్‌బాబు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తండ్రి కృష్ణ (మే 31) పుట్టిన రోజు సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమం బుధవారంతో ముగిసిందని.. గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రహాస్పిటల్స్‌ వారికి మహేష్‌ సతీమణి నమత్ర సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికే ఎంతోమంది చిన్నారుల గుండె ఆపరేషన్‌కు సాయం చేసిన మహేష్‌… ఇప్పుడు ఎంతో బాధ్యతతో.. సొంత ఊరిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయిడంచడం చాలా గొప్ప విషయం అంటూ.. పలువరు ప్రశంసిస్తున్నారు. మహేష్‌ ప్రస్తుతం సర్కారువారిపాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.