కమల్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.. మహేష్‌

‘ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌ విక్రమ్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ . లోకేశ్‌ కనగరాజ్‌.. నేను మిమ్మల్ని కలిసి.. విక్రమ్‌ సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకూ చిత్రీకరణ ఎలా జరిగిందో తెలుసుకుంటా. ఈసినిమా అన్ని రకాలుగా మైండ్‌ బ్లోయింగ్‌. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్‌ కమల్‌హాసన్‌ నటన గురించి మాట్లాడే అర్హత నాకు ఇంకా రాలేదు! నా అనుభవం సరిపోదు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఆయన అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది.ఇందులో ఫహద్‌ ఫాజిల్‌, విజరు సేతుపతి నటనలో మెరుపులు కనిపించాయి. అంతేకాదు.. అనిరుధ్‌ కెరీర్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించాడు. చాలాకాలం తర్వాత విక్రమ్‌ నా ప్లే లిస్ట్‌లో టాప్‌లో ఉంది. కమల్‌ సార్‌, చిత్ర బఅందానికి శుభాకాంక్షలు ” అని మహేష్‌బాబు చేసిన ట్వీట్‌ ఆసక్తి రేపింది.