సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన మహేష్

ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న మహేష్‌ బాబు ‘జిఎంబి’ ఎంటర్టైన్మెంట్‌ పేరుతో పలు సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్‌’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో పాల్గన్న ఆయన విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన తండ్రి కృష్ట బయోపిక్‌పై స్పందించారు. ‘మీ అభిమానులకు కృష్ణ గారి బయోపిక్‌ ఎప్పుడు అందిస్తారు?’ అని విలేకరి అడుగగా ‘కృష్ణ గారి బయోపిక్‌ ఎవరైనా తీస్తే నేను చూసి సంతోషిస్తా.. అంతేకానీ, నేను నాన్న బయోపిక్‌ తీయను, అయన నా దేవుడు.. అవసరం అయితే ప్రొడ్యూస్‌ చేస్తా’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ గా మారాయి.