కొత్త ఏడాది కొత్త రికార్డు సెట్‌ చేసిన మహేష్‌

మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్‌లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్న మహేష్ ట్విట్టర్‌లో దుబాయ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. అభిమానులందరికి న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ అందరూ దయతో, కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో సంచలనం సృష్టించింది.