రాజ‌మౌళి సినిమా కోసం ప్రిపేర్ అయ్యే ప‌నిలో ప్రిన్స్‌

ప్రిన్స్ మ‌హేశ్ బాబు తాజాగా త‌న ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో మ‌హేశ్ చాలా ఫ్రెష్ లుక్‌లో అందంగా క‌నిపిస్తున్నారు. మొత్తం నాలుగు ఫొటోల‌ను షేప్ యువ‌ర్ స్టోరీ అనే ట్యాగ్‌తో మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ మ‌హేశ్ లుక్స్ అదుర్స్ అని అంటున్నారు.
ప్ర‌స్తుతం మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ పూర్తి డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో సూప‌ర్ స్టార్ ఉన్నారు. దీనిలో భాగంగా రాజ‌మౌళి సూచ‌న మేర‌కు ఇప్ప‌టికే విదేశాల‌కు కూడా వెళ్లొచ్చారు. కాగా, ఈ సినిమా ఓ అడ్వెంచర్ డ్రామాగా ఉండ‌బోతుంది.