మండుటెండలో సారెతో తరలివస్తున్న భక్తులు..

శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మల్లన్న దేవుడిని దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది.

ఈ నేపద్యంలో దేవస్థానం అధికారులు నడిచి వచ్చే భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు. పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా చూశారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రహదారి వెంట వాటర్ ట్రాంకర్లతో నీరు చల్లుతున్నారు. భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకార్యకర్తలు అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్నారు.