సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై స్పందించిన మంచు మనోజ్‌

సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారంపై హీరో మంచు మనోజ్‌ స్పందించాడు. మంగళవారం బాధిత చిన్నారి కుటుంబ సభ్యులను మనోజ్‌ పరామర్శించాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చిన్నారి విషయంలో జరిగింది అత్యంత క్రూరమైన చర్య అన్నాడు. బాలికపై జరిగిన ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపు నిచ్చాడు. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పించాలన్నాడు.