మోహన్ బాబు పుట్టినరోజు… స్పెషల్ ఫోటో షేర్ చేసిన మంచు మనోజ్

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… ఇవాళ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోహన్ బాబు పిల్లలు సైతం టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న కుమారుడు మంచు మనోజ్‌ తండ్రికి స్పెషల్ విషెస్ చెప్పాడు. మోహన్ బాబు తనను చిన్నప్పుడు ఎత్తుకున్న ఫోటోతో పాటు… తన తండ్రి వెంట నడుస్తున్న ఫోటోను మనోజ్ ట్వీట్ చేశారు. ‘ మై డాడ్ మై హీరో… హ్యాపీ బర్త్ డే నాన్న’ అని తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు మనోజ్.

అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ ప్రభావంతో తనకు బర్త్ డే విషెస్ తెలిపేందుకు ఎవరూ రావద్దని తన అభిమానులకు పిలుపునందించారు మోహన్ బాబు. విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో పేరుతో లేఖను విడుదల చేశారు. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తన పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్‌లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు.