ఏసీబీ కస్టడీకి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు మిగితా నలుగురు నిందితులు ఏసీబీ కస్టడీకి తరలించారు. ప్రస్తతుం హైదరాబాద్ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. జైలు నుండి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంకు ఐదుగురు నిందితులను తరలిస్తున్నారు. నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 58.59 లోని 112 ఎకరాల భూమికి సంబంధించిన noc ఇవ్వడం కోసం కోటి 12 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులకు అడిషనల్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నిందితులకు పీపీ కిట్లు వేసి నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన రూ.కోటి 12 లక్షల లంచం కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లోని నిందితులను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌, ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ సత్తార్‌, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్‌గౌడ్‌ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిని నాలుగు రోజుల పాటు ప్రశ్నించనున్నారు.