టాలీవుడ్ డైరెక్టర్లకి మెగాస్టార్ చిరంజీవి చురకలంటించారు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అమీర్‌ఖాన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి కొన్నివారాల సమయం తీసుకున్నారు. కేవలం డైలాగ్స్ కోసమే ఆయన ఇతర నటీనటులకు కూడా వర్క్‌షాప్ నిర్వహించారు. అదే మన తెలుగు చిత్ర పరిశ్రమలోని డైరెక్టర్స్ నటులకు ముందుగా డైలాగ్స్‌ని ఇవ్వరు. అప్పటికప్పుడే సెట్స్‌లోనే డైలాగ్స్ రాసి ఇస్తారు. దీంతో వెనువెంటనే.. డైలాగ్స్ చెప్పండి అంటే.. నటించేవారికి ఆ డైలాగ్స్ రావడం లేదు. దీంతో వందశాతం నటనను ఇవ్వలేకపోతున్నాం. ఓ నటుడు నటన మీద ఏకాగ్రత పెట్టాలంటే.. డైరెక్టర్స్ ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.’ అని ఆయన అన్నారు.
