రాజీవ్‌ కోటి సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌

కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి హీరోగా, వర్ష విశ్వనాథ్‌ హీరోయిన్‌గా.. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేష్‌ (బళ్లారి) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం ’11:11′ ప్రారంభమైంది. ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ను గురువారం చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారణం కోటిగారు. నా సినిమా అనేసరికి ప్రత్యేకించి ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సంగీతం అందించారు. నా విజయానికి, నా ఎదుగుదలకి సింహభాగం రాజ్‌ – కోటిలదే అని చెప్పాలి. ఇద్దరూ నా సినిమాకి 80, 90 దశకంలో సుమారు 60 సాంగ్స్‌ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ ఇచ్చారు. ఈ రోజు ఆయన కుమారుడు రాజీవ్‌ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాజీవ్‌ తండ్రి బాటలో పయనించి సంగీతంలో తండ్రికి తగ్గ తనయుడిగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినీ ఇండిస్టీకి కొత్త తరం రావాలి. దర్శకుడు కిట్టుగారికి, హీరోయిన్‌ వర్షలకు ఈ సినిమా ద్వారా గొప్ప సక్సెస్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ చిత్ర యూనిట్‌ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.