మహిళల భద్రత కోసమే సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్ మహిళా పక్షపాతి అని మంత్రి తానేటి వనిత అన్నారు. దిశ చట్టం పట్ల ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే 21 రోజుల్లోనే బాధితులకు న్యాయ జరిగేలా నిందితులకు శిక్ష పడుతుందని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం జగన్ దిశా చట్టాన్ని తీసుకువచ్చారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. చట్టం అమలులకు పోలీస్ విభాగాన్ని పటిష్టం చేశామన్నారు. ఇప్పటికే అవసరమైన సిబ్బంది, సాంకేతిక సహకారాన్ని అందించామని, మహిళల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
