సీఎంగా చంద్రబాబును కాపులు ఇష్టపడటంలేదు: అంబటి

టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం రేసులో లేకపోవడంతో నేతలందరూ జనసేనను వదిలి వైసీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ- జనసేన సభతో జెండా ఎత్తేశారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఢీకొట్టడం సాధ్యం కాదని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తెలిసిపోయిందన్నారు. లెక్కల్లో 1 ప్లస్ 1 రెండు అవుతుందని, కానీ రాజకీయాల్లో జీరో అయిందని ఎద్దేవా చేశారు. పవన్ డైలాగులు సినిమాల్లో పని చేస్తాయని.. రాజకీయాల్లో పని చేయవని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపులు ఇష్టపడటంలేదని మంత్రి అంబటి వెల్లడించారు