బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని

అసెంబ్లీ నుంచి చంద్రబాబు బాయికాట్‌  హైడ్రామాపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ఇదంతా ముందస్తుగా రచించుకున్న వ్యూహంలో భాగమే. ఇకపై అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయాలనేది గురువారం సాయంత్రమే పార్టీ నేతలతో చర్చించుకొని దానిని యథాప్రకారంగా నేడు అమలు చేశారు. ఈ విషయంపై మాకు ముందస్తు సమాచారం ఉంది.  మంత్రి బొత్స సత్యనారాయణతో కూడా ఇప్పటిదాకా అదే విషయంపై మాట్లాడుతున్నా. చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోతున్నారు అని బొత్స సత్యనారాయణ నాతో చెప్తున్నారు. అంతలోనే చంద్రబాబు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తూ సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ మొసలి కన్నీరు కారుస్తూ అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేశారు.